శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈ రోజు నాట్య కదంబా అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్సు, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమములో వినాయక కౌత్వం, మూహికవాహన, నమశ్శివాయతే, జతిస్వరం తదితర గీతాలకు సమన్విత, ప్రవస్తి, రాజేశం తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
