శ్రీశైల దేవస్థానం: కొత్త వెంకటరెడ్డి, అర్చన, హైదరాబాద్ బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు 2 వెండి చెంబులు, పంచహారతి, తీర్థం గిన్నె – ఉద్ధరిణిలను సమర్పించారు. ఈ వస్తువుల బరువు మొత్తం 740 గ్రాములు.
వీటిని వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, పర్యవేక్షకులు హరికృష్ణ, ఆలయ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు సమక్షములో దేవస్థానానికి అందించారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
