శ్రీశైల దేవస్థానం:దేవస్థానానికి ఈ రోజు 12న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, శ్రీశైలం శాఖ వారు టాటా గూడ్స్ కంటైనర్ ట్రక్ వాహనాన్ని విరాళంగా సమర్పించారు.
గంగాధర మండపం వద్ద ఈ వాహనాన్ని , సంబంధిత పత్రాలను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మెన్ కె. ప్రమోద్‌కుమార్‌రెడ్డి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడుకు అందించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, అర్చకస్వాములు, దేవస్థానం అధికారులు బ్యాంకు ప్రతినిధులతో కలిసి సంప్రదాయబద్దంగా వాహనపూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మెన్ మాట్లాడుతూ టాటా గూడ్స్ కంటైనర్ ట్రక్ కొనుగోలు చేసి దేవస్థానానికి విరాళంగా అందించామన్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ ఈ వాహనాన్ని అన్నప్రసాద వితరణకు సంబంధించిన కూరగాయలను సరఫరా చేసుకునేందుకు వినియోగించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ యం. సుధాకర్, శ్రీశైలం బ్రాంచ్ మేనేజరు రవింద్రారెడ్డి, సంబంధిత బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా సహాయ కమిషనరు ఇ. చంద్రశేఖరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు జి.స్వాములు, యం.హరియానాయక్, పి. ఉమేష్, పర్యవేక్షకులు సి.హెచ్. కోమలి, ట్రాన్స్‌పోర్టు విభాగం అసిస్టెంట్ ఇంజనీరు యం. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
