కనీసం మరో 2.5 లక్షల మంది లబ్ధిదారులను చేరుకోవడం లక్ష్యం
రూ.4,111 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ కార్పస్‌కు ఆమోదం
పథకం ముఖ్య లక్షణాలు:
అర్హులైన రుణగ్రహీతలు: కొత్త, గ్రీన్ ఫీల్డ్ సంస్థలను స్థాపించే మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
అందించే మొత్తం సహాయం: రూ. 10.00 లక్షల కంటే ఎక్కువ నుంచి రూ. 1.00 కోటి వరకు రుణాలను ‘కాంపోజిట్ లోన్’ (వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్ కలిపి) రూపంలో లేదా కేవలం ‘టర్మ్ లోన్’ రూపంలో పొందవచ్చు. (ఇది ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 85 శాతం వరకు ఉంటుంది).
అర్హత కలిగిన రంగాలు: తయారీ, సేవలు, వాణిజ్యం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు.
క్రెడిట్ గ్యారెంటీ కవరేజీ: రుణ మొత్తంలో 85 శాతం
గ్యారెంటీ ఫీజు: 0.50 శాతం ప్రామాణిక గ్యారెంటీ ఫీజు
ప్రభావం:
మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కల్పించడం… తద్వారా వెనకబడిన వర్గాల ప్రజలు పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయడానికి, వారి వ్యవస్థాపన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వీలు కల్పించడం… సమ్మిళిత ఆర్థిక వృద్ధికి తోడ్పడటం.
