శ్రీశైల దేవస్థానం:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ వుంటుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ తరువాత చివరగా ఊయలసేవ నిర్వహించారు.
ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు.
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు. ఈ ఓ తదితరులు పాల్గొన్నారు.
