సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ముఖ్యాంశాలు
- ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది
- మన బిడ్డలను ప్రపంచంలోనే గొప్ప స్థానాల్లో చూడాలని నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నాం
- నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ దేశాల్లోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయి
- ఈరోజుల్లో ప్రైవేటు వైద్యం అత్యంత ఖరీదుగా మారింది
- అందుకే పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టిమ్స్ ను ప్రారంభించాం
- ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోసం రూ.2700 కోట్లు ఖర్చు చేశాం
- సీఎంఆర్ఎఫ్ కోసం రూ. 2526 కోట్లు ఖర్చు చేశాం
- ఇప్పటి వరకు రూ. 5226 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేశాం
- రెండేళ్లలో రూ.21,800 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ కోసం ఖర్చు చేశాం
- ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరితే…. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రయత్నించలేదు
- టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ ఆసుపత్రికి కేవలం టెంకాయకొట్టి వదిలేశారు
- మేం అధికారంలోకి వచ్చాక సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం
- ఇవన్నీ పూర్తయితే 10 వేల పడకల ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి
- 2027, డిసెంబర్ 9 వరకు ఉస్మానియా, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేస్తాం
- ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్ ను నియమించి పర్యవేక్షిస్తాం
- కార్పొరేట్ తరహాలో ఆసుపత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటాం
- ఆసుపత్రికి వచ్చే రోగుల అటెండెంట్ లకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తాం
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా సమయాన్ని కేటాయించే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ప్రోత్సహకాలను అందిచేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నా
- పేదలకు వైద్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ఉంది.. మా రేవంతన్న ఉన్నాడు అనేలా ప్రజలకు నమ్మకం కలిగించండి
- మేం టిమ్స్ ను ప్రారంభిస్తామని చెప్పగానే కొందరు పగటి వేషగాళ్లల్లా వచ్చి తిరిగి పోతున్నారు
- కేటీఆర్ వచ్చి ఇది తామే కట్టామని చెప్పి వెళ్లారు.
- వెనక ఉన్న మెంటల్ హాస్పిటల్ కు వెళ్లి పేషంట్లకు టిమ్స్ లు కట్టింది నేనే నన్ను గుర్తుపట్టలేదా అని కేటీఆర్ అడిగాడట
- అక్కడ ఉన్న రోగి ఊకో బిడ్డా నేను కూడా మొదట్లో అలాగే మాట్లాడేవాడిని.. రాను రాను వాడే తగ్గిపోతది అని చెప్పాడట..
- మీరు కడితే పదేళ్లలో ప్రారంభించడానికి సమయం దొరకలేదా?
- మీ కుటుంబమే అధికారంలో వున్నపుడు ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదు?
- మీరు ఎర్రవెల్లి, జన్వాడ, మొయినాబాద్, శంకర్ పల్లి ఫామ్ హౌసులు నిర్మించుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం కానివ్వలేదు
- కానీ పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులు పూర్తి చేయాలని ఆలోచన రాలేదా?
- ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోండి..
- నియోజకవర్గానికో పది, 20 కోట్లు ఖర్చు చేసి సేవ చేస్తే మీ పాపాలు కొంతైనా తగ్గుతాయి
- కానీ అబద్ధపు ప్రచారాలతో ఏదో చేయాలనుకుంటే ప్రజలు నమ్మరు
- కెసీఆర్, కేటీఆర్ 2034 వరకు మారకూడదని, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా
- వాళ్లు అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇలాగే నిజాలు చెబుతూనే ఉంటా
