శ్రీశైల దేవస్థానం:
ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈరోజు కచ్ఛపి కృపాసాధన వీణా ట్యూటోరియల్, హైదరాబాద్ వారు వీణనాదం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ వీణనాద కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో వక్రతుండమహాకాయ, శివతాండవం, భో…శంభో, ముదాకరాతమోదకం, శివాష్టకం, శివస్తోత్రం మొదలైన పలుగీతాలు , అష్టకాలు మొదలైనవాటిని సమర్పించారు
ఈ కార్యక్రమములో వీణా సహకారాన్ని శ్రీరాగలక్ష్మి, సూర్యాంశ్, శ్రీజన్య, నాగేశ్వరి, నాగద్యుత్, మమత, వాగ్వేద, మహతి, మృదంగ సహకారాన్ని పంచవటి శ్రీనివాస్ అందించారు.
