శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణ , కార్తీక మాసాలలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ శివ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు కార్తీక మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ రోజు ప్రారంభమైంది. ఈ అఖండ భజన మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు (09.12.2026) న ముగుస్తుంది.
ఈ ప్రారంభ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కోడె కాంతివర్ధిని, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, అర్చకస్వాములు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
కాగా ఈ శివభజనలో ముందుగా లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం భజనకార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు.
ఆ తరువాత శాస్త్రోక్తంగా చండీశ్వరస్వామివారికి విశేష పూజలు జరిపించారు. ఈ పూజల అనంతరం శివప్రణవ పంచాక్షరీనామ అఖండ శివ భజన ప్రారంభించారు.
కాగా ఈ భజనలలో కర్నూలు జిల్లాకు చెందిన మూడు భజన బృందాలకు మరియు కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాలకు అవకాశం కల్పించారు. శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి, కర్నూలు ( 10.11.2026 నుండి 15.11.2026 వరకు), శ్రీ లక్ష్మీచెన్నకేశవ భజన బృందం, కర్నూలు ( 15.11.2026 నుండి 20.11.2026 వరకు), శ్రీశ్రీశ్రీ గంగాభవాని సమేత కేదారేశ్వర స్వామి దేవస్థానం కమిటీ, కర్నూలు (20.11.2026 నుండి 24.11.2026 వరకు) శ్రీ మౌళీ బసవేశ్వర భజన మండలి, గోపనదేవరహళ్ళి, రాయచూర్ జిల్లా (24.11.2026 నుండి 29.11.2026 వరకు), శ్రీ మల్లికార్జున భజన మండలి, సుంకేశ్వరహాల్, రాయచూర్ జిల్లా, కర్ణాటక (29.11.2026 నుండి 04.12.2026 వరకు ) శ్రీ ప్రభులింగ సేవా సంఘం, గోపనదేవరహళ్ళి, రాయచూర్ (04.12.2026 నుండి 09.12.2026 వరకు), వారు భజనలను చేయనున్నారు.
