శ్రీశైల దేవస్థానం:
• నవంబరు 10 నుంచి డిసెంబరు 9 వరకు కార్తీకమాసోత్సవాలు
• కార్తీక మాసమంతా భక్తులరద్దీ కారణంగా గర్భాలయ అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల
• పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలకు రూ. 216/- రుసుముతో అవకాశం
• నవంబరు 20 కార్తీక శుద్ధ ఏకాదశిరోజున దేవస్థాన ఆగమ పాఠశాల ఎదురుగా కోటి దీపోత్సవం
• కార్తీకమాసంలోని సోమవారాలలో లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి
• కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం, లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి,
• నవంబరు 13న పాతాళగంగ వద్ద కృష్ణమ్మహారతి
• శని,ఆది,సోమవారాలు , పర్వదినాలలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల
• సాధారణ రోజులలో నిర్దిష్టవేళలో అయిదు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం
నవంబరు 10 నుండి డిసెంబరు 9 వతేదీ వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ,కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్తీకమాసోత్సవాల నిర్వహణకు వివిధ ఏర్పాట్లు చేశామన్నారు.
భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ఆలయ వేళలు, శ్రీస్వామిఅమ్మ వార్ల ఆర్జితసేవలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీక్రమబద్దీకరణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, కార్తీక సోమవారాలు, అదేవిధంగా కార్తీకమాసంలో ప్రతీసోమవారం మరియు కార్తీకపౌర్ణమి రోజున జరిగే పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం, నవంబరు 13వ తేదీన జరిగే కృష్ణమ్మహారతి, నవంబరు 20న జరిగే కోటి దీపోత్సవం, నవంబరు 24న కార్తీకపౌర్ణమినాడు జ్వాలాతోరణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్తీకమాసంలో ఆకాశదీపం ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలకు సంబంధించి పలు ఏర్పాట్లు చేసామన్నారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
• భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తీక మాసంలో రద్దీరోజులందు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
దర్శనం ఏర్పాట్లు :
• ప్రతీరోజూ వేకువ జామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను కొనసాగుతాయన్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు కొనసాగుతాయన్నారు.
• శని,ఆది,సోమవారాలు , ఇతర పర్వదినాలలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు.
సాధారణ రోజులలో విడతలవారీగా స్పర్శదర్శనం :
• శని,ఆది,సోమవారాలు కాకుండా తక్కిన సాధారణ రోజులలో రోజుకు 5 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శర్శనానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
• సర్వదర్శనం క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్దిష్టవేళల్లో విడతలవారీగానే ఈ స్పర్శదర్శనం కల్పించడం జరుగుతుందన్నారు.
ఆర్జితసేవలు :
• గత సంవత్సరం వలెనే సాధారణ భక్తుల సౌకర్యార్థం కార్తీకమాసమంతా కూడా గర్భాలయ అభిషేకాలను మరియు సామూహిక అభిషేకాలను పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు.
• సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తికమాసంలో శని,ఆది,సోమవారాలు మరియు పర్వదినాలలో ( 16 రోజులపాటు) అమ్మవారి అంతరాలయంలో నిర్వహించు కుంకుమార్చనలు (రూ.1000/-రుసుము) ఆశీర్వచన మండపంలో నిర్వహణ.
• రుద్రహోమం, చండీహోమం, సాక్షిగణపతి హోమం, నిత్యకల్యాణం మొదలైన ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు :
• శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా భక్తులు పరమేశ్వరునికి అభిషేకాలను జరిపించుకునేందుకు వీలుగా పంచమఠాలలో ఆర్జిత అభిషేకాన్ని ఈ సంవత్సరము ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు
• భక్తులు కేవలం రూ. 216/-లను మాత్రమే రుసుముగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక టికెట్ పై దంపతులు లేదా ఒకరిని అభిషేకానికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ ఆర్జిత అభిషేక టికెట్లను మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 మరియు ఏ.పి.టి.ఎస్ వారి వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చునని అన్నారు. అభిషేకానికి అవసరమైన పూజాసామాగ్రిని దేవస్థానం సమకూరుస్తుందన్నారు.
• భక్తులు వారి అభీష్టం మేరకు పంచమఠాలుగా ప్రసిద్ధమైన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలోని ఏదైనా ఒకమఠంలో ఈ ఆర్జిత అభిషేకాన్ని జరిపించుకోవచ్చునని అన్నారు.
అన్నప్రసాదాల వితరణ :
• భక్తులకు అన్న ప్రసాదవితరణ భవనములో ఉదయం గం.10.45ల నుండి అన్నప్రసాదాల వితరణ.
• సాయంత్రం గం. 7.00ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు.
• క్యూకాంప్లెక్స్‌లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచి నీరు,బిస్కెట్లు, అల్పాహారం.
• అదేవిధంగా రద్దీ అధికంగా ఉన్న రోజులలో ఉదయం వేళలో వేడిపాలు.
లడ్డు ప్రసాదాలు :
• కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు.
• కార్తీకమాసమంతా కూడా అదనపు ప్రసాద విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయబడుతాయి. అదనంగా 6 కౌంటర్లను ఏర్పాటు చేసి మొత్తం 14 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేయబడుతాయన్నారు.
పాతాళగంగవద్ద ఏర్పాట్లు
• కార్తీకమాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు.
• పాతాళగంగవద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ.
• అదేవిధంగా అదనపు లైటింగ్ ఏర్పాట్లు.
• భద్రతాచర్యలలో భాగంగా పాతాళగంగ వద్ద ఈతనిపుణులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కేశఖండనశాలలో ఏర్పాట్లు.
• భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కేశఖండనశాలలో ఆయా ఏర్పాట్లు.
• ముఖ్యంగా భక్తులరద్దీకనుగుణంగా కేశఖండనశాల వేళలను నిర్థారించడం కూడా జరిగిందన్నారు.
సూచిక బోర్డుల ఏర్పాట్లు :
• భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ప్రదేశాలలో తగినన్నీ సూచికబోర్డులు ఏర్పాటు.
కార్తీకమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు :
• లోకకల్యాణం కొరకు కార్తికమాసంలో అఖండ శివభజనలు నిర్వహించేలా చర్యలు.
కార్తీక దీపారాధన
• భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు. . .
• అదేవిధంగా ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద కూడా దీపారాధనకు తగిన ఏర్పాట్లు.
కృష్ణమ్మ హారతి :
• నవంబరు 13వ తేదీన పాతాళగంగ వద్ద జరిగే కృష్ణమ్మ హారతికి అవసరమైన అన్ని చర్యలు.
కోటి దీపోత్సవం – జ్వాలాతోరణోత్సవం :
• నవంబరు 20, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున దేవస్థాన ఆగమ పాఠశాల ఎదురుగా మైదానములో కోటి దీపోత్సవం , నవంబరు 24న గంగాధరమండపం వద్ద కార్తీక పౌర్ణమినాడు జ్వాలాతోరణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు.
పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి
• కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున ఎప్పటి వలనే ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం మరియు పుష్కరిణి హారతి కార్యక్రమాలు .
సాంస్కృతిక కార్యక్రమాలు
• ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు.
• లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు
