ప్రారంభమైన ఉచిత బస్సు సదుపాయం
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం ఉచిత బస్సు సౌకర్యం
ప్రారంభించింది.వారాంతపు సెలవు రోజులతో పాటు ఆయా పర్వదినాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటారు.
ఈ కారణంగా భక్తుల సౌకర్యార్థమై వారాంతపు రోజులలో , శుక్రవారం సాయంత్రం గం. 5.00ల నుంచి సోమవారం మధ్యాహ్నం గం. 2.00ల వరకు గణేశసదన్ నుండి అన్నప్రసాద భవనం మీదుగా క్యూకాంప్లెక్సు వరకు భక్తులు ఈ ఉచిత బస్సును వినియోగించుకోవచ్చు.
ఈ ఉచిత బస్సు ప్రారంభ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ/సి) పి. చంద్రశేఖరశర్మ, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
*కళారాధనలో సంప్రదాయ నృత్య సన్నివేశం
- ఆకర్షిస్తున్న ఆకాశ దీపం
- ఆనందంగా ఊయల సేవ
- శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,01,000/-లను కొమ్ము సూర్య సోమయాజి, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
Post Comment