శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం శ్రీమతి కె. ప్రమీలా భాగవతారిణి, కర్నూలు ‘రుద్రాక్ష తులాభారం’పై హరికథాగానం చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథాగానం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి హార్మోనియం సహకారాన్ని యం. మనోహర్, తబలా సహకారాన్ని యన్. బాబురావు అందించారు.
రెండవ కార్యక్రమములో భాగంగా కళ్యాణి శేఖర్ ఇనిస్ట్యూట్ ఆఫ్ డాన్సు , నల్గొండ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు..
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
