శ్రీశైల దేవస్థానం:
ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈరోజు ( 03.08.2026) శ్రీమతి డి. లక్ష్మీ మహేష్ భాగవతారిణి, కర్నూలు పార్వతీకల్యాణం’ పై హరికథాగానం చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథాగానం కార్యక్రమం ఏర్పాటు చేశారు .
ఈ కార్యక్రమానికి కీబోర్డు సహకారాన్ని రామలింగయ్య, , తబలా సహకారాన్ని బి.వెంకటేష్ అందించనున్నారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
