శ్రీశైల దేవస్థానం
ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,88,89,846/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తలిపారు. వివరాలు.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో ( 22.07.2026 నుండి 25.08.2026 వరకు) సమర్పించారు.
అలాగే ఈ హుండీలో 87 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 4 కేజీల 250 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 540 – యుఎస్ఏ డాలర్లు, 1610– యు.ఏ.ఇ దిర్హమ్స్, 20 – సింగపూర్ డాలర్లు, 140 – ఇంగ్లాండు పౌండ్స్, 21 – మలేషియా రింగిట్స్, 10 – సౌదీరియాల్స్, 109- బహ్రైన్ దినార్, 100 – ఓమన్ బైసా, 5 – ఓమన్ రియాల్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
ఈ హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు , ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కె. కాంతివర్ధిని, శ్రీమతి ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, శ్రీమతి. పి.యు. శివమ్మ పర్యవేక్షించారు.
అదేవిధంగా హుండీల లెక్కింపులో పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.
