శ్రీశైల దేవస్థానం: వేసవి సెలవులు , ప్రభుత్వ సెలవు దినము కావడంతో ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకార్యార్ధం పలు ఏర్పాట్లు చేసినట్లుగా కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలియజేశారు. ముఖ్యంగా భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేసామన్నారు.
సౌకర్యాల కల్పనలో భాగంగా ప్రతి రోజు ఉదయం 6.00 గం. లకు క్యూ కాంప్లెక్స్ లోని భక్తులకు వేడి పాలు అందిస్తున్నామన్నారు. వేడి పాలు అందజేసిన తరువాత నిరంతరం మంచినీరు, మజ్జిగ , బిస్కెట్లు భక్తులకు ఇస్తున్నామన్నారు. క్యూ కాంప్లెక్స్ లోని భక్తులకు అల్పాహారం కూడా ఇస్తున్నామన్నారు.
ఎండ తీవ్రత కారణంగా క్షేత్రంలో పలుచోట్ల చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఈ చలివేంద్రాలలో చల్లని మంచినీటితోపాటు మజ్జిగ కూడా భక్తులకు అందిస్తున్నామన్నారు.
దేవస్థానం సూచనల మేరకు పలు సత్రాల వారు కూడా ఆయ సత్రాల ముందు చలివేంద్రాలను ఏర్పాటు చేసారన్నారు.
కాగా వేకువజామున 3.00 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలు సాగుతున్నాయన్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుండి దర్శనాలు కొనసాగుతున్నాయన్నారు.
