శ్రీశైల దేవస్థానం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మే 2వ తేదీన ఈ దేవస్థానం తరపున శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి, ఆదిలక్ష్మీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఏప్రియల్ 27వ తేదీ నుంచి మే 3వ తేదీవరకు పెంచలకోన క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
అక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 2వ తేదీన ఉదయం 10.30 గం. లకు ఈ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
పట్టు వస్త్రముల సమర్పణ కార్యక్రమములో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, వేదపండితులు పాల్గొంటారు.
ప్రతి సంవత్సరము ఆయా ఉత్సవాల సందర్భంగా కాణిపాకం దేవస్థానం, విజయవాడ ఇంద్రకీలాద్రి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, కొలనుభారతి సరస్వతీ అమ్మవారికి ఈ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతోంది.
