*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00,200/-లను జి. బాబు రాజేంద్రప్రసాద్, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీమతి ఎన్. విశ్వశాంతి , వారి బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి పంచరత్న కీర్తన, శివపంచాక్షరి, శివాష్టకం, అయిగిరినందిని, ఓం నమ:శివాయ తదితర గీతాలకు, అష్టకాలకు ఎస్. జ్ఞాపిక, సి.హెచ్. శ్రీవిద్య, ప్రణతిమిశ్రా, పి. ష కె. ప్రణిత, జి. హిమబిందు, నిత్యశ్రీ, హేమ, విధుల తదితరులు నృత్యప్రదర్శన చేశారు.
రెండవ కార్యక్రమములో భాగంగా నూపుర నృత్యాలయ, సికింద్రాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమములో వినాయకస్తుతి, బ్రహ్మాంజలి, లింగాష్టకం, కాలభైరవాష్టకం, జతిస్వరం తదితర గీతాలకు, అష్టకాలకు శరణ్య, అమూల్య, యశస్విని, గోవింద్, అద్వైత, శ్రావణి, శ్రీనిధి, వైభవ్య, తరుణి సుష్మ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు .
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది.
*Bayalu veerabadra swamy pooja Paroksha seva, Kaartheeka Aaakaasha Deepam performed in the temple.Archaka swaamulu performed the puuja.
*