శ్రీశైల దేవస్థానం:
ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈరోజు పవన్ కుమార్ , బృందం, కడప గాత్ర కచేరి కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ గాత్ర కచేరి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, ఓంకారనాదం, శంభో శివశంకరా, ఓంకార రూపిణి, భో…శంభో శివశంభో తదితర తదితర పలు శివకీర్తనలను పవన్‌కుమార్,.రమేష్, రమణమ్మ, శ్రీరాములు తదితరులు ఆలపించారు
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి
