శ్రీశైల దేవస్థానం;
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన) ఈ రోజు శ్రీ దుర్గా నృత్య కళానిలయ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో మహాగణపతి, మూషిక వాహన, తాండవ నృత్యకరి, భో…శంభో, శివస్తుతి, తదితర గీతాలకు ప్రణవి, సమృద్ధి, చందన, శరణ్య, సహస్ర, దీక్షిత, పావణి, సంజన తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
