శ్రీశైల దేవస్థానం:మంగళవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,28,37,281/- లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.
హుండీల రాబడిని భక్తులు గత 33 రోజులలో (23.04.2026 నుండి 25.05.2026 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. వివరాలు ఇవి.
హుండీలో 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 780 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 321 – యుఎస్ఏ డాలర్లు, 20 – యు.ఏ.ఇ దిర్హమ్స్, 2- సింగపూర్ డాలర్లు, 25 – ఇంగ్లాండు పౌండ్స్ , 14– మలేషియా రింగిట్స్ , 35– ఆస్ట్రేలియా డాలర్లు, 1 – కువైట్ దీనార్, 105 – కెనడా డాలర్లు, 200 – ఓమన్ బైసాలు, 5 – కత్తారు రియాల్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగింది.
హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు. హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కె. కాంతివర్థిని కూడా పాల్గొన్నారు. అదేవిధంగా పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.
