శ్రీశైల దేవస్థానం:
• భక్తులరద్దీ కారణంగా నాలుగు రోజులపాటు వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు నిలుపుదల
• శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం
• భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు
-కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు
వేసవి సెలవులు , వారాంతపు సెలవుల కారణంగా భక్తులరద్దీ అధికంగా ఉంటోంది.
ఈ కారణంగా మే 29వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ సోమవారం వరకు నాలుగు రోజులపాటు వి.ఐ.పి బ్రేక్ దర్శనాన్ని ( విరామ దర్శనాన్ని ) నిలుపుదల చేసినట్లుగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ నాలుగు రోజులు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే నని తెలియజేశారు.
భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు.
భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకరించవలసినదిగా కార్యనిర్వహణాధికారి కోరారు.
క్యూకాంప్లెక్సులో ఉదయం వేళలో వేడిపాలను ఇస్తున్నామని అన్నారు. అదేవిధంగా మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు కూడా నిరంతరం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో కూడా మంచినీటిని ఇవ్వడానికి తగు ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు.
అదేవిధంగా క్షేత్ర పరిధిలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో కూడా మంచినీటితో పాటు మజ్జిగను కూడా అందజేస్తున్నట్లుగా తెలియజేశారు.
