శ్రీశైల దేవస్థానం:
సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,45,55,035 /-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. వివరాలు ఇవి.
ఈ హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో (26.05.2026 నుండి 21.06.2026 వరకు) సమర్పించారు.
హుండీలో 127 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 680 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 392 – యుఎస్ఏ డాలర్లు, 10,105 – యు.ఏ.ఇ దిర్హమ్స్, 17 – సౌది రియాల్స్, 38- సింగపూర్ డాలర్లు, 5 – ఇంగ్లాండు పౌండ్స్ , 18– మలేషియా రింగిట్స్ , 160– ఆస్ట్రేలియా డాలర్లు, 40 – యూరోస్, 10 – కెనడా డాలర్లు, 11 – కత్తారు రియాల్స్, 3 – ఓమన్ రియాల్స్, 100 – ఓమన్ బైసాలుమొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగింది.
ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు. హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి జి. లక్ష్మేశ్వరి, శ్రీమతి జి. గంగమ్మ, శ్రీమతి కె. కాంతివర్ధిని, చిలువేరు కాశీనాథ్, శ్రీమతి ఉప్పుటూరి. సుబ్బలక్ష్మి, శ్రీమతి పి.యు. శివమ్మ, శ్రీమతి జి.శ్రీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, వాయుగండ్ల వెంకటేశ్వర్లు హుండీల లెక్కింపును పరిశీలించారు.
అదేవిధంగా హుండీల లెక్కింపులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.
అదే విధంగా అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 8,80,396/- రాబడిగా లభించింది. ఈ అన్నప్రసాద వితరణ హుండీని భక్తులు 93 రోజుల్లో అనగా 21.03.2026 నుంచి 21.06.2026 వరుకు సమర్పించారు.
