శ్రీశైల దేవస్థానం:
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఈరోజు శ్రీ మైలారం లింగేశ్వర భజన సేవా సమితి, వెలుగోడు, నంద్యాల జిల్లా వారు భజన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో వినాయకస్తుతి, శంకరా శివశంకరా, శివశివమూర్తివి, ఓం నమశ్శివాయా, శంభో హరహర మహాదేవ, లింగాష్టకం, మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను మొదలైన వాటిని పి. శ్రీనివాసరెడ్డి, వెంకటేశులు, బసయ్య, రామాంజనేయులు ఆంజనేయులు, నాగరాజు, గణేష్, లక్ష్మీదేవి తదితరులు ఆలపించారు.
ఈ కార్యక్రమానికి తబలా సహకారాన్ని యం. సుబ్రహ్మణ్యం, హర్మోనిస్ట్ సహకారాన్ని కె. నారాయణస్వామి అందించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
