శ్రీశైల దేవస్థానం:
ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,06,97,110 /- లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.
కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 30 రోజులలో ( 22.06.2026 నుండి 21.07.2026 వరకు) సమర్పించారన్నారు. వివరాలు ఇవి.
ఈ హుండీలో 91 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 160 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 1353 – యుఎస్ఏ డాలర్లు, 200– యు.ఏ.ఇ దిర్హమ్స్, 4 – సింగపూర్ డాలర్లు, 120 – ఇంగ్లాండు పౌండ్స్, 272 – మలేషియా రింగిట్స్, 10 – యూరోస్, 5 – కెనడా డాలర్లు, 50 – సౌత్ ఆఫ్రికా రాండ్స్ మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగింది.
ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కె. కాంతివర్ధిని, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎస్. చంద్రశేఖర్ పాల్గొన్నారు. అదేవిధంగా హుండీల లెక్కింపులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.
