శ్రీశైల దేవస్థానం:
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఈరోజు శ్రీ భవానీ భజన సేవా సమితి, వెలుగోడు, నంద్యాల వారు భజన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, లింగాష్టకం, బిల్వాష్టకం, నమ:శ్శివాయ, శంభో పార్వతి, శ్రీశైలవాసా, హర హర శంకరా మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను పి. శ్రీనివాసరెడ్డి, రవీందర్, రాజుచారి, వెంకటరెడ్డి, నరేంద్ర, రమేష్, రవి తదితరులు ఆలపించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
