శ్రీశైల దేవస్థానం:
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన) ఈ రోజు శ్రీ కళానర్తన కూచిపూడి డాన్సు అకాడమీ, హైదరాబాదు వారు కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది..
ఈ కార్యక్రమములో గణపతి కౌత్వం, నమశ్శివాయతే, అఖిలాండేశ్వరి, శివతాండవం, శివస్తుతి తదితర గీతాలకు గాయత్రి, నవ్యశ్రీ, షణ్ముఖి, జ్యోతి, జ్యోతిసునీత తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
