శ్రీశైల దేవస్థానం:
• భక్తులకు ప్రాథమిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉండాలి
• పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
• మెరుగైన సౌకర్యాల ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
• భక్తులు వందశాతం సంతృప్తి పడే విధంగా సౌకర్యాలను మెరుగుపరచాలి –
యం. శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి
క్షేత్రాన్ని సందర్శించే భక్తులు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా ఆయా ఏర్పాట్లు ఉండాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మెరుగైన సౌకర్యాల కల్పనే దేవస్థానం లక్ష్యమని అన్నారు.
మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, శౌచాలయాల నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనపై భక్తుల నుంచి వందశాతం సానుకూలత స్పందనే లక్ష్యంగా పనిచేయాలని ఈ ఓ అన్నారు.
క్యూలైన్లు, క్యూకాంప్లెక్సులలో వాటర్ క్యాన్లతో త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాధిపతులను ఆదేశించారు ఈ ఓ. క్షేత్ర పరిధిలో నీటి వినియోగంలో అంతరాయాలను క్రమబద్దీకరించి వ్యర్థాలను తొలగించి మురుగునీటి వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. క్షేత్ర పరిధిలో పైపులైన్ల పనితీరును నిరంతరం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తుండాలని నీటివిభాగాన్ని ఆదేశించారు.
భక్తులకు అవసరమైనంత మేర చల్లటి త్రాగునీటిని అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వాటరు వర్క్సు విభాగాన్ని ఆదేశించారు. గతంలో వలనే అన్ని సత్రాల వారు కూడా చలివేంద్రాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించారు. చలివేంద్రాలలో చల్లని నీటిని కూడా భక్తులకు అందిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం క్షేత్రపరిధిలోని దేవస్థానం కాటేజీలు, గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని సంబంధిత పరిసరాలలో చెత్తాచెదారాలు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని వసతి విభాగాన్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. మురళీబాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు బి. మల్లికార్జునరెడ్డి, కె. వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
