గోవా : దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లకు సామాజిక భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించి అర్హులైన వారందరికీ పెన్షన్ అందించేలా కృషి చేస్తానని కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖా సహాయ మంత్రి శ్రీపాద నాయక్ అన్నారు. గోవా సైన్స్ సెంటర్లో శనివారం ప్రాంభమైన సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రథమ జాతీయ సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ ల సమస్యలు దేశవ్యాప్తంగా వెలుగు లోకి తీసుకొస్తున్న జర్నలిస్ట్ ల నేతలను అభినందించారు.
గోవా సమాచారశాఖ డైరెక్టర్ దీపక్ బందేకర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యల పట్ల గోవా ప్రభుత్వం పూర్తి అవగాహన తో పలు సామాజిక భద్రతా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళుతోందన్నారు.
ఈ కార్యక్రమానికి సందీప్ దీక్షత్ అధ్యక్షత వహించగా, ఎన్.పి.చేకుట్టి, దేశ వ్యాప్తంగా పలువురు అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.
