శ్రీశైల దేవస్థానం:
*కర్ణాటక – మహారాష్ట్ర పాదయాత్ర భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 16.03.2026 నుండి 20.03.2026 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 19.03.2026 రానున్నది.
ఈ ఉత్సవాల సందర్భముగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా సౌకర్యాలు కల్పించే విషయమై చర్చించేందుకు ఈరోజు పరిపాలనా భవనములో సమావేశం నిర్వహించారు. కర్ణాటక , మహారాష్ట్రలకు చెందిన పలు పాదయాత్ర భక్తబృందాలు, స్వచ్చంద సేవా సంస్థల భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు,పాదయాత్ర బృందాలు , స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఫిబ్రవరి 25న కర్ణాటక రాష్ట్రములోని భాగల్‌కోట్ జిల్లా తాలుకా కేంద్రమైన తేర్‌దాళ్‌లోని అల్లమప్రభు దేవస్థానములో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
కాగా ఈనాటి సమావేశంలో బాగల్కోట్, బెళగావి, బీజాపూర్ (విజయపుర) మొదలైన జిల్లాల నుంచి , మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లా , షోలాపూర్, అక్కల్కోట్ ప్రాంతాలకు చెందిన సుమారు 63 భక్త బృందాలు, పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సుదీర్ఘముగా జరిగిన ఈ సమావేశములో ఉత్సవ సంబంధి పలు అంశాలు కూలంకుషంగా చర్చించారు .
ఈ సమావేశంలో ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా తాలుకా కేంద్రమైన తేర్దాళ్లో జరిగిన మొదటి సమన్వయ సమావేశానికి , ధర్మప్రచారంలో భాగంగా అక్కడ జరిపిన ధర్మరథయాత్ర , కల్యాణోత్సవానికి కర్ణాటక , మహారాష్ట్ర భక్త బృందాలు ఎంతగానో సహకరించాయని చెబుతూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఉగాది ఉత్సవాలలో అనగా తేది : 16.03.2026 నుంచి 20.03.2026 వరకు అయిదురోజులపాటు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని, ఉత్సవాల రోజులలో శ్రీ స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉందడని పేర్కొంటూ, ఈ విషయములో భక్త బృందాల ప్రతినిధులు భక్తులలో అవగాహన కల్పించాలన్నారు.
అయితే ఉత్సవాలకంటే 10 రోజుల ముందునుంచి అనగా 06.03.2026 నుండి 15.03.2026 వరకు ప్రతీరోజు నిర్దిష్ట వేళలలో నాలుగు విడతలుగా భక్తులకు శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ స్పర్శదర్శనం టికెట్ రుసుము రూ. 500/-లుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క విడతలో కరెంట్ బుకింగ్ ద్వారా 1500 టికెట్లు మాత్రమే ఇవ్వబడుతాయన్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మరో 500 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు . ఈ ఆన్లైన్ టికెట్లను www.srisailadevasthanam.org లేదా www.aptemples.ap.gov.in పొందవచ్చు. అదేవిధంగా మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009 ద్వారా కూడా స్పర్శ దర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించారు.
అదేవిధంగా భక్తులు సేద తీరేందుకు ఆరు బయలు ప్రదేశాలలో చలువ పందిర్లు వేయడం జరుగుతుందన్నారు. అన్ని చలువ పందిర్ల వద్ద మంచినీటి సదుపాయం కల్పించబడుతుందన్నారు.
క్యూలైన్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ వితరణకుగాను స్వచ్ఛంద సేవకులు సేవలను అందించాలన్నారు.
ఉత్సవాల సందర్భంగా క్షేత్రపరిధిలో పలుచోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయబడుతాయన్నారు. అదేవిధంగా దేవస్థానం వైద్యశాల నిరంతరం వైద్యసేవలను అందిస్తుందన్నారు.
శ్రీశైలక్షేత్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రం కూడా నిరంతరం వైద్యసేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జనలను క్షేత్రపరిధిలో నిషేధించడం జరిగిందని, భక్తాదులందరు దేవస్థానం పలుచోట్ల ఏర్పాటు చేసిన శౌచలయాలలోనే తమ కాలకృత్యాలను తీర్చుకోవాలన్నారు. ఈ విషయమై స్వచ్ఛందసేవా సంస్థల వారు భక్తులలో మరింత అవగాహన కల్పించాలన్నారు.
స్వచ్చంద సేవకుల సేవలు:
ఉగాది మహోత్సవాలలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ స్వచ్చంద సేవకులు స్వామివారి ఆలయం, ముఖమండపం, నందిమండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్రదర్శనం ఉచిత క్యూలైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగాభవానిస్నానఘట్టాలు, పాతాళగంగ హఠకేశ్వరం, సాక్షిగణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, తాత్కాలిక సమాచార కేంద్రాలు తదితర చోట్ల ఆయా సేవలను అందించవలసి ఉంటుందన్నారు.
లాటరీ ద్వారా సేవా ప్రదేశాల కేటాయింపు:
స్వచ్ఛంద సేవకులకు సేవా ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గతంలో వలెనే స్వచ్ఛందసేవా బృందాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలను కేటాయించారు.
* above images of different events.
*ఓం నమ:శ్శివాయ🙏
తేదీ : 01-03-2026
సమయం : (4:30 AM TO 11:10 PM)
దర్శనం చేసుకున్న మొత్తం భక్తుల సంఖ్య = 33,925
అన్నప్రసాద వితరణ కేంద్రం భక్తుల
సంఖ్య = 5,919
ప్రస్తుత దర్శనం = అలంకార దర్శనం
ఈరోజు దర్శనాలు ముగిసినవి
