తెప్పోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఈ ఓ పెద్దిరాజు
శ్రీశైల దేవస్థానం: ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన దసరా మహోత్సవాలు 24వ తేదీతో ముగియనున్నాయి. ఉత్సవాల చివరిరోజు అయిన 24వ తేదీ రాత్రి ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ తెప్పోత్సవ సమయములో పుష్కరిణిలో తగినంత నీటిమట్టం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీస్‌శాఖతో సమన్వయంతో తగు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. తెప్పోత్సవం సమయంలో పుష్కరిణి పరిసరాలలో తగినంత లైటింగు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి.రామకృష్ణ, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment