అనేక కేసుల్లో నిందితుడు మునిశేఖర్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసారు . చక్రిపురం చౌరస్త లో ఖుశాయిగూడ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఇతను దొరికాడు . నెంబర్ ప్లేట్ లేని ఇండికా కారు లో వస్తుండగా పోలీసులు ఆపి కారు వివరాలు తెలుసుకోగా ఆ ఇండికా కారు ని 15 రోజుల క్రితం ఎ.ఎస్. రావు నగర్ కాలనీ లో దొంగతనం చేసినట్లు చెప్పాడు . అనంతరం విచారించగా చిత్తూరు జిల్లా కురపర్థివారిపల్లి, రొంపిచర్ల కు చెందిన మునిశేఖర్ రెడ్డి గా గుర్తించారు . ఇతని పై గతంలో 46 కు పైగా కేసులు నమోదయ్యాయి.