శ్రీశైల దేవస్థానం:
కార్తిక మాసోత్సవాల సందర్భంగా 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ముందు గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహిస్తారని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవానికి ఆయా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా పౌర్ణమి సందర్భంగా లక్షదీపోత్సవం , పుష్కరిణి హారతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
కాగా పురాణపరంగా త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశునికి దృష్టి దోషపరిహారం కోసం, ఇంకా విజయుడైన అతని గౌరవార్థం పార్వతీదేవి మొదటగా ఈ జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించిందనీ, అప్పటి నుండి ఇది ఆచారమైందని పండితులు పేర్కొంటున్నారు.
అందుకే ఆలయంలో ఈ జ్వాలాతోరణోత్సవాన్ని జరపడం సంప్రదాయమైంది.
ఈ జ్వాలాతోరణ దర్శనం విశేష ఫలదాయకమని చెప్పారు.
లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి:
కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సం , పుష్కరిణి హారతి నిర్వహించింది.
