శ్రీశైల దేవస్థానం:
సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో తేది :07.08.2026 నుండి 11.08.2026 వరకు 5 రోజులపాటు వరుణ యాగసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు గణపతిహోమం, రుద్రహోమం, మృత్యుం జయహోమం, చండీహోమం,మల్లికార్జునస్వామివారి వద్ద జరిగే ఆర్జితసేవలు నిలుపుదల చేసినట్లుగా తెలియ జేశారు. ఈ రెండు రోజులు ఆర్జితపరోక్షసేవలు కూడా ఉండవన్నారు.
అదేవిధంగా 9 మరియు 10 తేదీలలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. అలాగే 11వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం వేళలో స్పర్శదర్శనం ఉండదన్నారు. రాత్రి వేళ మాత్రమే స్పర్శదర్శనం ఉంటుందన్నారు.
ఆగస్టు 9 మరియు 10వ తేదీలు శని,ఆదివారాలు కావడంతో ఎప్పటి వలనే ఈ రెండు రోజులు గర్భాలయ అభిషేకాలు , సామూహిక అభిషేకాలు కూడా ఉండవన్నారు.
భక్తులు ఈ మార్పును గమనించి దేవస్థానానికి సహకరించాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి కోరారు.
