శ్రీశైల దేవస్థానం:
సామాన్య భక్తుల సౌకర్యార్థం ఇటీవల ప్రోటోకాల్ దర్శనం విధానంలో మార్పులు చేసినట్లుగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
వారంలో మూడు రోజులపాటు అనగా శని,ఆది,సోమవారాలలో రాత్రి వేళలో నిర్ధిష్ట సమయంలో మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మూడు రోజులలో ఉదయం, మధ్యాహ్నం వేళలో స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదన్నారు.
వారంలో తక్కిన రోజులలో అనగా మంగళ,బుధ,గురు,శుక్రవారాలలో యథావిధిగా రోజుకు మూడు పర్యాయాలుగా నిర్ధిష్ట వేళలో స్పర్శదర్శనం కల్పించబడుతుందన్నారు. అయితే రాబోవు శ్రావణమాసంలో శుక్రవారం రోజులలో కూడా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్పర్శదర్శనం ఉండదన్నారు.
కాగా ఆలయానికి వచ్చే ప్రముఖులు కనీసం రెండు రోజుల ముందుగా వారి పర్యటన వివరాలను తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
అదేవిధంగా వసతి , దర్శనం కోసం పంపే సిఫారసు లేఖలను కూడా అధికారిక లెటర్‌హెడ్‌పై కనీసం రెండు రోజుల ముందుగా దేవస్థానానికి సమాచారాన్ని అందజేయవలసినదిగా కోరారు.
ఈ లేఖలను protocol@srisailadevasthanam.org మెయిల్ ఐ.డికి పంపవలసి వుంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ లేఖలను ప్రోటోకాల్ ఫోన్ నెం. 9160016215 కు వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చునన్నారు.
కాబట్టి అందరు కూడా ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించవలసినదిగా ఈ ఓ కోరారు.
