శ్రీశైల దేవస్థానం:
• ఆగస్టు 13న శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
• సెప్టెంబరు 12వ తేదీన ముగియనున్న శ్రావణ మాసోత్సవాలు
• శ్రావణమాసం సందర్భంగా ఆన్లైన్ టికెట్ల విధానంలో మార్పులు
ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 12 శ్రావణ మాసోత్సాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షలు పోతుగుంటరమేష్ నాయుడు , కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ శ్రావణ మాసంలో భక్తులరద్దీ అధికంగా ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవలు , స్పర్శదర్శనం టికెట్లలో తగు మార్పులు చేయడం జరిగిందన్నారు.
భక్తులరద్దీ అధికంగా ఉండే శ్రావణ శుక్ర,శని,ఆది, సోమవారాలలో అనగా మొత్తం 19 రోజుల పాటు అర్జిత అభిషేకములు మరియు ఆర్జిత కుంకుమార్చనలు నిలుపుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రద్ధీరోజులలో ఒక్క విడతలో అనగా రాత్రి గం. 8.30ల స్లాట్ నందు స్వల్పంగా కేవలం 250 స్పర్శదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో వుంచడం జరిగిందన్నారు.
మిగిలిన రోజులలో యథావిధిగా రోజుకు మూడు నిర్ధిష్ట సమయాలలో అనగా ఉదయం గం. 7.30లకు మ. గం. 12.30లకు మరియు రాత్రి గం. 9.00ల స్లాట్లలో శ్రీస్వామి స్పర్శదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. రద్దీ తక్కువగా ఉండే రోజులలో ఆర్జిత ఆభిషేకం, ఆర్జిత కుంకుమార్చన టికెట్లను యథావిధిగా పొందవచ్చునని అన్నారు.
భక్తులు ఆయా టికెట్లను సులభంగా పొందేందుకు వీలుగా 80శాతం టికెట్లను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే సదుపాయం కల్పించబడిందన్నారు. అదేవిధంగా దేవస్థానం వెబ్సైట్ ద్వారా మిగిలిన 20 శాతం టికెట్లను భక్తులు పొందవచ్చునని వారు తెలిపారు.
పై పరిమితులకు లోబడి మనమిత్ర వాట్సప్ మరియు దేవస్థానం వెబ్సైట్ ద్వారా యథావిధిగా టిక్కెట్లను పొందడంలో ఎటువంటి అంతరాయడం లేదన్నారు.
సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వచ్చిన వార్తలలో ఎటువంటి వాస్తవము లేదన్నారు.
స్పర్శదర్శనం మరియు ఆర్జితసేవాటికెట్లు పొందగోరే భక్తులు మనమిత్ర వాట్సప్ / ఆన్లైన్ ద్వారా టికెట్లను ముందస్తుగానే పొంది తదనుగుణంగా తమ యాత్రను రూపొందించుకోవాలన్నారు.
*file photo
