శ్రీశైల దేవస్థానం:
శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు , ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ లేదా దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ చేయించుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలియజేశారు.
ప్రజలకు ఆయా పౌరసేవలను సులభతరంగా అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ నెంబరును 9552300009 అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆయా పౌరసేవలను సమర్థవంతంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా వచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో పౌరులు పలు శాఖలకు సంబంధించిన ఆయా సేవలను పొందవచ్చునని అన్నారు.
మనమిత్ర వాట్సాప్ ద్వారా దేవదాయశాఖ పరిధిలోని పలు ఆలయాల దర్శనం టికెట్లు, ఆర్జితసేవాటికెట్లు, ప్రసాదాల టికెట్లు . విరాళాలను చెల్లించే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.
వాట్సాప్ ద్వారా శ్రీశైల దేవస్థానం శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లను పొందవచ్చునని తెలియజేశారు. శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 17 ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చునని పేర్కొన్నారు.
వసతిని ఆన్లైన్లో రిజర్వు చేసుకునేందుకు , అన్ని ఆర్జితసేవా టికెట్లు, శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం మొదలైన అన్నిటికెట్లను ఆన్లైన్లో పొందేందుకు భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.srisailadevasthanam.org లను మాత్రమే వినియోగించుకోవాలన్నారు.
దేవదాయశాఖ లేదా దేవస్థాన అధికారిక వెబ్సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ పొందునప్పుడు ఫోన్‌పే ద్వారా లేదా గూగూల్ పే ద్వారా నగదు మొత్తము వ్యక్తి గత ఖాతాలోకి జమ చేయమని ఎక్కడా అడగడం జరగదని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.
ఎవరైనా ఫోన్‌పే ద్వారా లేదా గూగూల్ పే ద్వారా నగదును తమ ఖాతాలో చెల్లించమని అడిగినప్పుడు దానిని సైబర్ మోసంగా గుర్తించాలని సూచించారు. ఈ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేవస్థాన దేవదాయశాఖ వెబ్సైట్ కాకుండా భక్తులు ఇతర నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.
అదేవిధంగా క్షేత్రపరిధిలో ఎనిమిది ప్రదేశాలలో కియోస్కు మిషన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. మరో 12 ప్రదేశాలలో కూడా వీటిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సందేహ నివృత్తి కోసం భక్తులు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 / లను సంప్రదించవచ్చునని కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
** 11 న కార్యక్రమాలు
సోమనాథ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు , దాని పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతప్రభుత్వ సాంస్కృతికశాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరున పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది
ఇందులో భాగంగా మే 11వ తేదీన శ్రీశైలదేవస్థానంలో కూడా ఈ కార్యక్రమం వుంటుంది.
ఈ సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
1. ఉదయం గం.7.00లకు గంగాధర మండపం వద్ద కలశయాత్ర, అనంతరం పంచాక్షరీ మంత్రలేఖనం
2. గంగాధర మండపం వద్ద గల ఏర్పాటు చేయనున్న వేదికపై గం. 10.00లకు ఎల్.ఈ.డి స్క్రీన్ నందు జాతీయ కార్యక్రమం ప్రదర్శన
3. సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేయనున్న వేదిక వద్ద గం.5.30ల నుంచి శివభజనలు, శివభక్తి గేయాలు
4. సాయంత్రం గం. 6.30లకు ఓంకార మంత్రజపం,
5. రాత్రి గం. 7.30ల నుంచి పేరిణి శివతాండవం
