

శ్రీశైల దేవస్థానం:
• కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు
• శిక్షణలో పాల్గొన్న 160 మందికి పైగా యోగసాధకులు
• ఈ నెల 20వరకు కొనసాగనున్న యోగాశిక్షణా తరగతులు
యోగాంధ్ర కార్యక్రమములో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న యోగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలియజేశారు. స్థానికులు భక్తుల సౌకర్యార్థం ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. గణేశ్ పుడ్ కోర్ట్ లో ఈ శిక్షణను ఏర్పాటుచేశామన్నారు.
గురువారం గణేశ్ పుడ్ కోర్ట్ లో జరిగిన శిక్షణా కార్యక్రమములో 160 మంది యోగసాధకులు పాల్గొని యోగా శిక్షణను పొందడం జరిగిందన్నారు. దేవస్థానం సిబ్బంది, స్థానికులు, శివసేవకులు కూడా ఈ యోగా శిక్షణకు హాజరయ్యారన్నారు.
స్థానికులు, యాత్రికులు ఈ కార్యక్రమములో పాల్గొని, యోగాపట్ల అవగాహన కలగించుకోవాలని అన్నారు.
కాగా ఈ రోజు జరిగిన శిక్షణా కార్యక్రమములో ముందుగా యోగా గురువులు మాట్లాడుతూ యోగా కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగసాధన వలన కలిగే ఆరోగ్య ఎన్నో ప్రయోజనాలు కూడా వివరించారు.
కార్యక్రమములో అందరిచేత సూర్యనమస్కారాలు, ప్రాణాయామం చేయించారు. అనంతరం పలు సూక్ష్మవ్యాయామాలు చేయించారు. చివరగా సాధకులచేత పలు యోగాసనాలు వేయించారు.
