శ్రీశైల దేవస్థానం:
ఉగాది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ కార్యక్రమాలు జరిగాయి.
అశ్వవాహనసేవ:
వాహన సేవలో భాగంగా శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
అశ్వవాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని నమ్మకం.
నిజాలంకరణ:
ఉగాది మహోత్సవాల అలంకారాలలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని భ్రమరాంబాదేవి నిజాలంకరణ స్వరూపంలో అలంకరింపజేయడం ప్రత్యేకం.
అష్టభుజాలను కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చింది.
అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్నీ తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
కాగా పూజాదికాల తరువాతా ఆలయ ప్రాంగణములో ప్రదక్షణగా ఉత్సవ మూర్తులకు ఆలయ ఉత్సవం ప్రత్యేకం.
ఆలయ ఉత్సవంతో ఉగాది ఉత్సవాలు సమాప్తం.

