శ్రీశైల దేవస్థానం,నంద్యాల:* స్వయంగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS
శ్రీశైలం ఉగాది మహోత్సవాలలో ఉగాది రోజు గురువారం అత్యంత వైభాగంగా రథోత్సవం సందర్భంగా ఎలాంటి అపశృతులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు.
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఏర్పాట్లను స్వయంగా డ్రోన్ కెమరా ద్వారా పరిశీలించారు. చండీహోమం అనంతరం రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి, కార్యక్రమాలు జరిపించారు.రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నరాశి) సాత్వికబలిగా సమర్పించారు.
ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. రథోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గొరవనృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.
రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారం:
శ్రీ అమ్మవారి అలంకారాలలో భాగంగా ఈ రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం, అలంకార మూర్తికి విశేష పూజలు జరిపించారు. చతుర్భుజాలను కలిగిన ఈ దేవిపాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇచ్చారు . ఈ దేవిని దర్శించడం వలన కోరికలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం
