శ్రీశైల దేవస్థానం: ఈ నెల 8వ తేదీన ఉదయం గం. 11.00ల నుంచి దేవస్థానం పరివార దేవాలయమైన ఫాలధార – పంచధార వద్ద శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగనున్నది.
జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం కరకమలములచే ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగనున్నది.
ఉదయం గం. 8.00లకు ముందుగా ఫాలధార – పంచధార వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో అధివాస హోమాలు, నూతన విగ్రహాలకు నేత్రోన్మీలనము అనంతరం పూర్ణాహుతి జరుగనున్నాయి.
తరువాత ఉదయం. గం. 11.00ల నుంచి 12. 30 వరకు ఫాలధార – పంచధారలోని నూతన ఆలయం లో విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం జరుగనున్నది.
కాగా మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈప్రతిష్ఠా సంబంధి కార్యక్రమాలు నిన్నటి రోజున ( 06.03.2026) ఉదయం ప్రారంభమయ్యాయి
రెండవ రోజైన ఈ రోజు ఉదయం నూతన విగ్రహాలకు ధాన్యాధివాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సాయంత్రం పుష్పాధివాసము, .శయ్యాధివాసము, అధివాస హోమములు జరిపారు. చివరగా మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ జరిగాయి.
కాగా నిన్నటి రోజున (06.03.2026) ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనము,ఋత్విగ్వరణం, మండపారాధన, చతుర్వేద పారాయణలు, నూతన విగ్రహాలకు జలాధివాసం జరిపించారు. అదేవిధంగా నిన్నటి సాయంత్రం క్షీరాధివాసం, అధివాసహోమాలు జరిపించారు.
రేపు ( 08.03.2026) జరుగనున్న విగ్రహాల ప్రతిష్ఠతతో ఈ కార్యక్రమం ముగియనున్నది.
