శ్రీశైల దేవస్థానం:
హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యములోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా 27న దేవస్థానంలోని అన్నప్రసాద వితరణ భవనం వద్ద కమాండ్ కంట్రోల్ సముదాయంలోని సమావేశ మందిరంలో ఉదయం గం. 10.30 నుంచి సాయంత్రం గం. 5.00ల వరకు ఈ ధార్మిక సదస్సు జరుగుతుంది.
ఈ సమావేశానికి హిందూధర్మపరిరక్షణ ట్రస్ట్ ఛైర్మెన్ డా. దాసరి శ్రీనివాసులు, (రిటైర్డు ఐ.ఏ.ఎస్.) , కర్నూలు, నంద్యాల, కడప హెచ్.డి.పి.టి కో- ఆర్డినేటర్లు, అర్చక సంఘాల వారు పాల్గొననున్నారు.
స్థానిక సత్రాల వారు, ఆగమ పాఠశాల, వేద పాఠశాల విద్యార్థులు యావన్మంది భక్తాదులు పాల్గొనవలసినదిగా దేవస్థానం కోరింది
