











శ్రీశైల దేవస్థానం:
ప్రభోత్సవం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం ప్రత్యేకం.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో పుష్పాలంకరణ స్పెషల్.
ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయనృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలు ప్రభోత్సవంలో ప్రత్యేకం.
నందివాహనసేవ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వాహనసేవలో భాగంగా ఈ రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహన సేవ ఆలయ ఉత్సవం ప్రత్యేకం.
