
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీనివాస భజన బృందం, విజయవాడ వారిచే భజన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, లింగాష్టకం, శ్రీశైల శివమయం, శివశివ శంకరా, శంభో హరహర మహాదేవ, లింగాష్టకం, శ్రీశైలవాస, పార్వతినాథుడా, శ్రీగిరి మల్లయ్య, పాతాళగంగమ్మ, కైలాసవాసుని, ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా మొదలైన పలు భక్తిగీతాలను, భజనకీర్తనలను ప్రమీలారాణి, బోసు, ఉమాదేవి, రాధిక, శైలజ, శివకుమారి, సుజాత తదితరులు ఆలపించారు.