శ్రీశైల దేవస్థానం:
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) బుధవారం సనాతన వాహిని భజన బృందం, కడప వారి భజన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో జయజయ వినాయక, అదిగదిగో శ్రీశైలం, శ్రీశైలవాసా, నమో విశ్వరూప, జయ జయ గిరిజాశంకరా, శివశివ శంకరా మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను నాగభూషణం, జయచంద్రరాజు, సుధాకర్, సతీష్, చెంగయ్య, వేములయ్య, గంగమ్మ, శాంతమ్మ, ఆదమ్మ, సరోజమ్మ, లక్ష్మీదేవి తదితరులు ఆలపించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
