
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం శ్రీసాయి నటరాజు అకాడమీ, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో వినాయక కౌత్వం, తాండవ నృత్యకరి, శివపంచాక్షరీ, అఖిలాండేశ్వరి, అష్టలక్ష్మీస్తోత్రం, శివతాండవం తదితర గీతాలకు, అష్టకాలకు సాయి అద్వితీయ, మహాత్రయి, సుభిక్ష, శ్రీవల్లి, భరణి, అక్షిత, మోక్షిత, మన్విత, నారాయణి, పావని తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.