మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్  హైలైట్స్*

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు.

వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం

ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము.

17 పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి

అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగింది..

మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోంది.

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారు.

2019లో బీజేపీ 4 గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు

అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35శాతానికి పెరిగాయి.

బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారు.

బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆరెస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.

వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆరెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు.

కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆరెస్ ను ప్రజలు తిరస్కరించారు.

ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆరెస్ కు సూచన చేస్తున్నా.

మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు..

బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయింది..

మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు.

దేశ ప్రజలు మోదీని తిరస్కరించారు..

తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలి..

ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు.

విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుంది..

ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలి.

ఇప్పటివరకు 18 గంటలే పనిచేసాం.. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తాం..

రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదే..

వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి..

ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం..

ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది.

print

Post Comment

You May Have Missed