
శ్రీశైల దేవస్థానం:31.12.2023 ఆదివారం , 01.01.2024 సోమవారం కావడంతో గర్భాలయం, సామూహిక అభిషేకాలు స్పర్శదర్శనం నిలుపుదల చేస్తారు.31.12.2023న ఆదివారం సెలవురోజు , 01.01.2024 సోమవారం పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు.ఈ కారణంగా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా రెండు రోజులు కూడా గర్భాలయ అభిషేకాలు , సామూహిక ఆర్జిత అభిషేకాలు పాటు శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేస్తారు.
కాగా ఆర్జితహోమాలు, అమ్మవారి కుంకుమార్చనలు యధావిధిగా వుంటాయి. వీటికి ముందస్తుగా ఆన్లైన్ టికెట్ పొందవలసివుంటుంది.
శీఘ్రదర్శనం – అతిశీఘ్రదర్శనం టికెట్లు:
రూ. 150/-ల రుసుముతో శీఘ్రదర్శనం (శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) , రూ. 300/-ల రుసుముతో అతిశీఘ్రదర్శనం టికెట్లను ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ టికెట్లలో 30శాతం టికెట్లు ఆన్లైన్లో , తక్కిన 70 శాతం టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తున్నారు.
కాగా ఈ రోజులలో ఉచిత దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. భక్తులందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. భక్తులందరు కూడా దేవస్థానానికి సహకరించాలని అధికారులు కోరారు.