అలరించిన స్కందమాత అలంకారం

శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా అయిదవ రోజైన ఈ రోజు (11.10.2021) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిగాయి.

శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి.

అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపారు.

ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు నిర్వహించారు.

కుమారి పూజ దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తున్నారు . కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం

| :

ఈ నవరాత్రి మహోత్సవాలలో  నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని స్కందమాత స్వరూపంలో అలంకరించారు.

నవదుర్గలలో ఐదవరూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగిఉండి, ఒక చేతిలో స్కందుణ్ణి పట్టుకుని ఉండి, మిగిలిన చేతులలో పద్మాలను, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు. స్కందదేవుని జనని కావడం వలన ఈ దుర్గా స్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. ఈ స్కందమాతను ఉపాసించడం వల్ల స్కందదేవుని కూడా ఉపాసన చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ దేవిని ఆరాధించడం వలన సకల కోర్కెలు నెరవేరడమే కాకుండా శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.

శేషవాహనసేవ

ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు శేషవాహనసేవ నిర్వహించారు.

ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, శేష వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేసారు. ఈ ఓ , అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed