శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు హంస వాహన సేవ అత్యంత ఘనంగా జరిగింది . భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు . దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారు . శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో హంస వాహనంపై వేంచేపు చేయించారు . వారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు జరిపారు . దేవస్థానం ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం చేసారు . చాలా చాల మనోహరంగా ఈ కార్యక్రమం జరిగింది .