భృంగివాహనసేవ
@ a glance of Brungi vaahana seva in Srisaila Devasthanam Sankranthi festival on 12th Jan.2025
*
శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఆదివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
ఉత్సవాలలో భాగంగానే యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోకకల్యాణంకోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ చేశారు.
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిగాయి.
అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిగాయి.
భృంగివావాన సేవ:
వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకారమండపంలో భృంగివాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సోమవారం కార్యక్రమాలు:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు వుంటాయి.
ఈ ఉత్సవాలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు కైలాస వాహనసేవ గ్రామోత్సవం వుంటుంది.