- యోగాంధ్ర-2026 కార్యక్రమం సందర్భంగా రేపు శ్రీశైలంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ ధనుంజయ్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట పాల్గొన్న శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు మరియు సంబంధిత సిబ్బంది. రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుల మేరకు యోగాంధ్ర కార్యక్రమములో భాగంగా తేది 8న ఉదయం గం. 7.00 ల నుండి ప్రధానాలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద యోగా కార్యక్రమం వుంటుంది
- Pallaki Seva performed in the temple on 7th june.Archaka swaamulu performed the puuja event.
-
సాంస్కృతిక కార్యక్రమాలు:దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈ రోజు ఎల్.సి.ఈ. కళానిలయం, ప్రకాశం జిల్లా వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఈ కార్యక్రమములో గణేశ పంచరత్నం, శివ మంగళం, నమశ్శివాయతే, భో..శంభో, కాలభైరవాష్టకం తదితర గీతాలకు మేఘన, మనశ్విని, వేదాంజలి, సహస్రాక్షర, శ్రీకళ తదితరులు నృత్యప్రదర్శన చేసారు.*పెద్ది రవీంద్ర, ఏలూరు ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,116/-లను అందజేశారు.. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
- ఈ రోజు ఎస్.వి.వి. సత్యనారాయణరెడ్డి, రావులపాలెం మొత్తం రూ. 5 లక్షలను దేవస్థానం అన్నప్రసాద వితరణకు విరాళంగా సమర్పించారు. ఆయన పేరుతో రూ. 1,00,000/-లు కుటుంబ సభ్యులు మరో నలుగురు పేరుతో ఒక్కొక్కరి పేరుతో రూ. 1,00,000/-ల చొప్పున విరాళంగా చెల్లించారు.ఎస్. వెంకటరెడ్డి ఆదిలక్ష్మి, ఎస్.వి.ఆర్. హర్షిణి, ఎస్.వి.ఎల్. హరిణి , ఎస్. నిహారిక పేరున విరాళాలు సమర్పించారు.
సంబంధిత మొత్తాన్ని దాతలు అన్నప్రసాద వితరణ సహాయ కార్యనిర్వహణాధికారి వై. సతీష్ మల్లిక్‌కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
శ్రీశైల దేవస్థానం:
• రెండవ రోజు కొనసాగిన యోగా శిక్షణా కార్యక్రమం
• శిక్షణలో పాల్గొన 600 మందికిపైగా యోగ సాధకులు
• గంగాధర మండపం వద్ద సోమవారం యోగా ప్రత్యేక కార్యక్రమం
యోగాంధ్ర కార్యక్రమములో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న యోగా శిక్షణా కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగించారని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ రోజు చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన శిక్షణా కార్యక్రమములో 600 మందికిపైగా యోగసాధకులు పాల్గొని యోగా శిక్షణను పొందడం జరిగిందన్నారు. దేవస్థానం సిబ్బంది, స్థానికులు , శివసేవకులతో పాటు యాత్రికులు కూడా ఈ యోగా శిక్షణలో పాల్గొన్నారన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు శివసేవకులు కూడా ఈ యోగా శిక్షణను పొందడం జరిగిందన్నారు.
జూన్ 8న ప్రత్యేక యోగా కార్యక్రమం :
కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం ప్రత్యేక యోగా కార్యక్రమం వుంటుందని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు. ఇందుకోసం గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయబడుతున్నాయని పేర్కొన్నారు.
స్థానికులు, యాత్రికులు ఈ కార్యక్రమములో పాల్గొని, యోగాపట్ల అవగాహన కలగించుకోవాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలియజేశారు.
కాగా ఈ రోజు జరిగిన శిక్షణా కార్యక్రమములో ముందుగా ప్రముఖ యోగా గురువు యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగా నిత్యజీవితంలో ఒక భాగం కావాలన్నారు. యోగ సాధన వలన ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. అందుకే యోగా ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణను పొందుతుందన్నారు.
కార్యక్రమములో అందరిచేత ఓంకార జపాన్ని చేయించడం జరిగింది. అనంతరం పలు సూక్ష్మవ్యాయామాలు చేయించారు. చివరగా సాధకులచేత పలు యోగాసనాలు వేయించారు.
